లగ చర్ల సంఘటన వెనక కేటీఆర్ హస్తం
*కొడంగల్ ను దత్తకు తీసుకున్న కేటీఆర్ మీ అభివృద్ధి ఎక్కడ?
ఎన్ ఎస్ యు ఐ ఉపాధ్యక్షులు సాయి ఓంకార్ గౌడ్
ప్రశ్న ఆయుధం నవంబర్ 16: కూకట్‌పల్లి ప్రతినిధి
టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొడంగల్ నియోజకవర్గం ను కేటీఆర్ దత్తత తీసుకున్న తీసుకున్నారు. దత్తత తీసుకున్న కేటీఆర్ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి రాగానే సీఎం సొంత నియోజకవర్గం అయినా కొడంగల్ ను అభివృద్ధిలో నడపాలని ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయడం కోసం భూసేకరణ చేపడితే అది ఎక్కడ విజయవంతమై ఆయనకు పేరు వస్తుందో అని కడుపు మంట తో టిఆర్ఎస్ పార్టీ కుట్రలు పండుతూ అక్కడ ఉన్న యువతను రెచ్చగొడుతూ దాడులకు ప్రేరేపిస్తున్నారని తాళ్లపల్లి సాయి ఓంకార్ గౌడ్ ఒక ప్రకటనలో విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఫార్మా విలేజ్ ఏర్పాటు అభివృద్ధిని స్వాగతించాలని పేర్కొన్నారు. గత పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి పందికొక్కుల మెక్కి తిన్నారు. ఇవాళ సీఎం అభివృద్ధి చేస్తా ఉంటే కడుపు మంట ఎందుకు అని ప్రశ్నించారు. 70 సంవత్సరాలుగా వెనకబడిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు మీరు చేసింది ఏంటి అంటే గాడిద గుడ్డు అని చెప్పవచ్చు. టిఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు పండిన కొడంగల్ ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఉంటారని ఆయన అన్నారు.