*బీసీ నేతలతో రేపు కేటీఆర్ సమావేశం*
కాంగ్రెస్ పార్టీ బీసీన్వర్గాలకు చేస్తున్న అన్యాయంపై క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టేందుకు గులాబీ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది.
ఎన్నికల్లో బీసీలకు హామీలు ఇచ్చి, మాట తప్పిన తీరుపై బీసీ వర్గాలను మరింత చైతన్యం చేయాలన్న దిశగా పార్టీ కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ, కులగణన పేరుతో ప్రకటించిన గణాంకాల్లో బీసీ వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ కావాలనే బీసీ వర్గాల సంఖ్యను భారీగా తగ్గించిందని అభిప్రాయాన్ని ఇటీవలే కొంతమంది బీసీ నాయకులు కేటీఆర్ కు తెలపగా.. ఈ విషయంలో ప్రభుత్వంపై ఎలా పోరాటం చేయాలనే అంశంపై రేపటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.