*రేపు లొట్ట పీస్ కేసులో ఈడీ విచారణకు కేటీఆర్?*
హైదరాబాద్: జనవరి 15
మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా- ఈ కారు రేసుకు సంబంధిం చిన కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది.కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత :ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఈ ఫార్ములా కార్ రేస్ లో మాజీ మంత్రి కేటీఆర్ రేపు గురువారం మళ్లీ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ రేపు మళ్లీ ఈడీ విచారణ కూడా హాజరు కావడం ఆసక్తిగా మారింది.. ఈ కేసులో ఏసీబీ ఎఫ్ఐ ఆర్, ఆధారంగానే ఈడీ విచారణ చేపట్టనుందా? లేక మరో కోణంలో విచారించనుందా? ఇదో లొట్ట పీస్ కేస్ అని మాజీ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈడీ కూడా అలాగే ప్రశ్నించి వదిలేస్తుందా? లేక అరెస్టు చేస్తుందా? అనే ప్రశ్నకు రేపటి వరకు వేచి ఉండాల్సిందే!.