కేటీఆర్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, కుట్రపన్ని ప్రభుత్వంపై ఫుడ్ సైజనింగ్ చేయించి దుష్ప్రచారం చేస్తున్నారు..

కేటీఆర్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, కుట్రపన్ని ప్రభుత్వంపై ఫుడ్ సైజనింగ్ చేయించి దుష్ప్రచారం చేస్తున్నారు

 డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు

 కామారెడ్డి

కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఫుడ్‌ పాయిజన్‌ ​​ఘటనలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు, రిటైర్డ్‌ బ్యూరోక్రాట్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఆదరణ చూసి ఇక బిఆర్ఎస్ పార్టీ అంతరించిపోతుందని భయపడి కాంగ్రెస్ పథకాలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రైతు భరోసా ఇచ్చాము, ఒకే దఫా 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి 70 శాతం మంది రైతులకు లబ్ధి పొందేలా చేశాం, ఇంకా 3 వేల కోట్లు రుణ మాఫీ చేయబోతున్నాం అన్నారు. దీనిపై రైతులకు రుణమాఫీ కాలేదని కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు ప్రాముఖ్యత ఇస్తూ సంక్షేమ హాస్టల్స్ లో డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచడం తో పేద విద్యార్థులలో విద్య పట్ల ప్రభుత్వ చర్యల పట్ల ఆసక్తి, విశ్వసనీయత పెరిగిందన్నారు. దీన్ని దెబ్బతీసి ప్రభుత్వ ప్రతిష్ఠతను దిగజార్చేందుకు విద్యార్థులలో ఆత్మ స్టేర్యాన్ని దెబ్బతీసేందుకు బిఆర్ఎస్, ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న భారీ కుట్ర నే ఈ ఫుడ్ పాయిజన్ అని అన్నారు. అధికారం లో ఉన్నపుడు బిఆర్ఎస్ నాయకులు ఇష్టమున్నట్టు దోచుకున్నారు.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి దోచు కొని నాశనం చేసిన బిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మేమే నిజాయితీ వంతులమని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాళా తీశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని రకాల హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి అభివృద్ధి పై ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలపై బిఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేస్తూ రాజకీయంగా పూట గడుపుకుంటుందని, 50 వేల ఉద్యోగాలు 10 నెలలలో ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. 10 ఏళ్లలో చేయలేని పనులు ఒక సంవత్సరంలో చేసి చూపించామని, ఇచ్చిన హామీల.ప్రకారం మహిళలకు బస్ ఉచిత ప్రయాణాలు, 200 యూనిట్ల కరెంట్, 500 రూపాయలకే సిలిండర్, ఆరోగ్య శ్రీ పథకాలు లాంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, పట్టణ యువజన అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, లీగల్ సెల్ అధ్యక్షులు

దేవరాజు గౌడ్, కౌన్సిలర్ ప్రసాద్, యువజన కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్(చందు)

పంతులు శీను తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment