కామ్రేడ్ సీతారాం కి జోహార్లు..!!

సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కి విప్లవ జోహార్లు

యాదాద్రి భువనగిరి, ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 12

ప్రపంచ మేధావి సిపిఎం ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతికి సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ బీబీనగర్ మండల కమిటీ తరఫున విప్లవ జోహార్లు తెలియజేస్తున్నామని వారి ఆశయాలను కొనసాగిస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ తెలియజేశారు. గురువారం బీబీనగర్ సిపిఎం మండల కార్యాలయంలో అమరజీవి కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతికి సంతాపం ప్రకటిస్తూ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం నర్సింహ మాట్లాడుతూ మార్క్సిజం పట్ల అపారమైన పట్టున్న గొప్ప సైద్ధాంతిక వేత్త, సిపిఎం అగ్ర నేతలు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య మాకినేని బసవపున్నయ్య హరికిషన్ సింగ్ సర్జిత్ పర్యవేక్షణలో భారత దేశం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో గుర్తించగలిగిన గొప్ప నాయకుడు కామ్రేడ్ సీతారాం అన్నారు. వారి అకాల మృతి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలకు కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని అన్నారు. ఎంతటి సమస్యనైనా ఇట్టే సామాన్యుడికి కూడా అర్దం అయ్యేలా వివరించగల నైపుణ్యం ఉన్న మేధావని అన్నారు.

ఎమర్జెన్సిలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ని జవహర్లాల్ నెహ్రూ యునివర్సిటీ కి వచ్చిన సందర్భం లో ప్రభుత్వ అసమర్థతను విద్యార్థుల సమక్షం లో నిలదీసిన ధైర్యశాలని అన్నారు. మార్క్సిజం మీద మాత్రమే కాక భారతీయ ఇతిహాసాలన్నింటిపైన, బైబిల్, ఖురాన్ లపై సంపూర్ణమైన అవగాహన కలిగిన దిట్ట అని అన్నారు. మతోన్మాదాన్ని అన్ని సందర్భాలలో చీల్చి చెండాడి భారత రాజకీయాలలో ప్రజల మధ్య ఐక్యతను,‌ భారత రాజ్యాంగాన్ని రక్షించడంలో విశేషమైన కృషి చేయడమే కాక ఆర్థిక విధానాలకు, మతోన్మాదానికి ఉన్న లంకెని గుట్టు విప్పి చెప్పిన గొప్ప నాయకుడు అన్నారు. BJP మతోన్మాదానికి వ్యతిరేఖంగా ఏర్పాటు అయిన ఇండియా వేదిక ఏర్పాటులో కీలక పాత్రను పోషించారాని, వామపక్షాల ఐక్యతకు విశేషమైన కృషి చేశారని, పశ్చిమ బెంగాల్ నుండి 2005 లో రాజ్యసభ కి ఎన్నికైన ఏచూరి ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను సూటిగా ప్రశ్నించి,ప్రత్యామ్నాయాలను సభ ద్వారా ప్రజలకు తెలియజేశారని,

రష్యా లో సోషలిజం కుప్ప కూలినప్పుడు మార్క్సిజానికి భవిష్యత్ లేదని వెర్రి కూతలు కూసిన వారికి తగు రీతిలో సమాధానం చెప్పి సకల సమస్యలకు అంతిమ పరిష్కారం మార్క్సిజమే అని ఎలుగెత్తి చాటిన యోధుడు కామ్రేడ్ ఏచూరి అని, అంతర్జాతీయంగా అనేక దేశాలు పర్యటన జరిపి, కమ్యూనిస్టులు, వామపక్ష వాదులు కలిసి సమాజ మార్పు కోసం చేయాల్సిన ఆచరణాత్మక కృషిని వివరించిన ప్రపంచం వేదావని అన్నారు. పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం సోషలిస్టు వ్యవస్థ మాత్రమేనని తుది శ్వాస విడిచే వరకూ మనసా,వాచా,కర్మణా అలుపెరుగని సైద్ధాంతిక పోరాటం చేసిన మార్క్సిస్టు అని, నేపాల్ లో మావోయిస్టులతో చర్చలు జరపడంలో అక్కడ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్రను పోషించిన నాయకుడని,పార్టీ లో అగ్ర నాయకులు మొదలుకొని సాధారణ కార్యకర్త వరకు ఉన్న పార్టీ శ్రేణులను ఆత్మీయంగా పలకరించడం ఆయన నైజం మని వారి ఆశయాలను కొనసాగించడానికి సిపిఎం పార్టీ యావత్ దేశవ్యాప్తంగా కృషి చేస్తుందని నర్సింహ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి సిపిఎం మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్ సిపిఎం నాయకులు వల్దాస్ హరికృష్ణ మంద కిరణ్ కుమార్ మునావత్ అశోక్ పబ్బతీ యాదగిరి వోల్దాసు బావ పొన్నం మల్లేష్ ఎల్ బాలయ్య పురుషోత్తం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now