తెరాస ప్రజా ప్రతినిధులు చేస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చిన కూకట్‌పల్లి కాంగ్రెస్ నాయకులు
ప్రశ్న ఆయుధ మార్చి04: కూకట్‌పల్లి ప్రతినిధి
కూకట్పల్లి నియోజకవర్గం లో అభివృద్ది సంక్షేమం జరగడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తెరాస నాయకులు, స్థానిక శాసనసభ్యుడు చేస్తున్న విమర్శలను కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టిగా తిప్పికొట్టారు. తెరాస ప్రజా ప్రతినిధులు చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య , పట్లోళ్లనాగిరెడ్డి, మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి ,ఏఐసిసి ప్రోటోకాల్ ప్రతినిధి సూరజ్ తివారి, డివిజన్ ప్రెసిడెంట్ కుక్కల రమేష్, తదితరులు బాలానగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు గత తెరాస ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎన్నికల ముందు 9o శాతం అభివృద్ధి చేశామని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు ఉదయం పార్కులు స్మశానాలు తిరిగి వాటిని అభివృద్ధి చేయాలని చెప్పడం తమ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఏమీ చేయలేదని చెప్పడమే అవుతుందన్నారు. ఉదయం గంట పాటు మాత్రమే నియోజకవర్గ పరిధిలోని ప్రజలకి అందుబాటులో ఉండే ఎమ్మెల్యే తాను చేసిన అభివృద్ధి ఏమి లేకపోవడంతో ఇప్పుడు నిద్రలేచి అది చేయండి ఇది చేయండి అంటూ మీడియా ముందుకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే తో పాటు కార్పొరేటర్ల సైతం ముఖ్యమంత్రి పైన రాష్ట్ర ప్రభుత్వం పైన స్థాయికి మించి ఆరోపణలు చేస్తున్నారని ఇలాంటి ఆరోపణలు మానుకోవాలని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు అభివృద్ధి ఏదైనా జరిగింది అంటే అది కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. నియోజకవర్గ పరిధిలో తెరాసకు చెందిన ఓ కార్పొరేటర్ శవాలమీద పేలాలు ఏరుకుతిన్నట్టు బాల నగర్ లో ఓ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మరణిస్తే అతని కుటుంబానికి ఇచ్చిన ఏడు లక్షల రూపాయల చెక్కును ఇవ్వకుండా చాన్నాళ్లు సతాయించాడని పోలీసుల జోక్యం చేసుకుంటే కానీ చెక్కును మృతుని కుటుంబ సభ్యులకు ఇవ్వలేదని విమర్శించారు. 10 సంవత్సరాలలో చేయని అభివృద్ధి కేవలం సంవత్సరంలో చేయలేదని శాసనసభ్యుడు విమర్శించడo పై కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. నాళాలు చెరువులు కుంటలు స్మశాన వాటిక స్థలాలు కబ్జా చేసిన టిఆర్ఎస్ నాయకులు సిగ్గులేకుండా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం తగదన్నారు. 10 సంవత్సరాల్లో అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దోచేసిన తెరాస నాయకులు ఇప్పుడు అభివృద్ధి అని అరవడం విచిత్రంగా ఉందన్నారు., ఈ కార్యక్రమంలో మధు ,హమీద్ భాయ్, నవాబ్ ,అజాజ్ ,క్రాంతి, టైగర్ యాదగిరి, నరేందర్ ,రాజ్ కుమార్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.