కేంద్ర బడ్జెట్ పై నిరసన తెలియజేసిన కూకట్‌పల్లి కాంగ్రెస్ శ్రేణులు

కేంద్ర బడ్జెట్ పై నిరసన తెలియజేసిన కూకట్‌పల్లి కాంగ్రెస్ శ్రేణులు

IMG 20250204 WA0066

ఆయుధం ఫిబ్రవరి 04: కూకట్‌పల్లి ప్రతినిధి

కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ పిలుపుమేరకు కూకట్పల్లి నియోజకవర్గంలో మూసాపేట చౌరస్తా వద్ద కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. రాస్తారోకో నిర్వహించారు.కేంద్రానికి బిజెపికి నిర్మల సీతారామన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తు నినాదాలు చేశారు ఫ్ల కార్డులు ప్రదర్శించారు కేంద్ర బడ్జెట్ వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే కనీస కృతజ్ఞత లేకుండా రాష్ట్రానికి మొండి చేయి చూపించారని రమేష్ ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. బడ్జెట్ కేటాయింపులపై ప్రతి వేదిక మీద బిజెపి తీరని అన్నారు.తీరును ఎండగడతామన్నారు .బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్రం పెద్ద గుండు సున్నా ఇచ్చిందని తెలంగాణ ప్రజలు కూడా రానున్న ప్రతి ఎన్నికల్లో బిజెపికి అంతే స్థాయిలో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని తక్కువ అంచనా వేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మార్కెటింగ్ కమిటీ మెంబెర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్ ,బ్లాక్ అద్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, మైనారిటీ నాయకులు, ఎస్ సి సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment