కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం
-ఎర్ర యాకన్న
ప్రశ్న ఆయుధం మార్చి 25: కూకట్‌పల్లి ప్రతినిధి
కూకట్పల్లి నియోజకవర్గంలో పనిచేస్తున్న విలేకరులందరూ తమ సభ్యత్వం నమోదు చేసుకోవాలని కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న సూచించారు.రేపు 25వ తేదీ మార్చి 2025 మంగళవారం రోజున సాయంత్రం 6 గంటలకు కూకట్పల్లి వివేకానంద నగర్ ప్రాంతంలోని వడ్డేపల్లి కమలమ్మ భవనంలో ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ సభ్యత్వ నమోదు ప్రారంభం కార్యక్రమం ఉంటుందని అధ్యక్షులు ఎర్ర యాకన్న తెలిపారు.ఈ మార్చి నెల 31వ తేదీ వరకు సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని,మరిన్ని వివరాలకు 9100764716, 9063214441 ఈ ఫోన్ నెంబర్స్ కి సంప్రదించాలని ఆయన తెలియజేశారు.మొదటి రోజు ఉపేంద్ర, వినీల్ గౌడ్, బాబీకాంత్, ప్రభాకర్ రెడ్డి సభ్యత్వం తీసుకున్నారు.