కులమతాలకతీతంగా వేద పాఠశాల నిర్వహణ 

కులమతాలకతీతంగా వేద పాఠశాల నిర్వహణ

 

– కుల మత భదం లేకుండా విద్యా బోధన

 

– 13 రోజులపాటు చండీ హోమం, ప్రతి ఒక్కరికి అవకాశం

 

– వేద పాఠశాల నిర్వాహకులు శీర్లవంచ కృష్ణమాచార్యులు

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 3

 

 

శ్రీ రామ కృష్ణ వైదిక ధర్మ పీఠం ఆధ్వర్యంలో ప్రతి ఆశాడ మాసంలో చండీ హోమం 13 రోజుల పాటు జరుగుతుందని శ్రీ రామకృష్ణ వైదిక ధర్మ పీఠం చైర్మన్ శీర్ల వంచ కృష్ణమాచారి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మో రక్షతె రక్షతః ,

హిందూ ధర్మాన్ని కాపాడండి అది మిమ్మల్ని కాపాడుతుందన్నారు. నాలుగు సంవత్సరాలుగా శ్రీ రామకృష్ణ వైదిక ధర్మ పీఠం పాఠశాలలో కుల మత భేదం లేకుండా తన సొంత ఖర్చులతో అన్ని కులాల వారికి వేద పాఠశాలలో ఉచితంగా విద్య బోధలను నేర్పించి వారికి తగిన స్థానం కల్పించి ప్రయోజకులను చేయడంలో తన వంతు కృషి చేస్తున్ననన్నారు. ఈ యొక్క వేద పాఠశాల ద్వారా చాలామంది ఆకర్షితులైన వారికి విద్యను అందించడం జరుగుతుందన్నారు. వేద విద్యను నేర్చుకోవడానికి హిందువులందరూ అర్హులే అని ఆసక్తి ఉన్న వారికి ఈ పాఠశాలలో అన్ని వసతులతో ఉచితంగా వేద పాఠలను నేర్పించడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసం సందర్భంగా 13 రోజులు చండీ హోమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా గురువారం మూడవ రోజు హోమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి వస్తున్న ప్రముఖుల అందరికీ వేద పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

Join WhatsApp

Join Now