బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడి గా కుమ్మరి యాదగిరి
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీసీ సంఘం జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన బీసీ నాయకుల సమావేశంలో, బీసీ రాజ్యాదికార సమితి రాష్ట్ర నాయకులు కాముని సుదర్శన్ నేత ఆధ్వర్యంలో బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కాముని సుదర్శన్ నేత మాట్లాడుతూ బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడి గా పిట్లంకు చెందిన కుమ్మరి యాదగిరి ని నియమించడం జరిగిందన్నారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసిన రాష్ట్ర నాయకులు కాముని సుదర్శన్ నేత కు, ఇతర రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ జిల్లాలో సంఘం అభివృద్ధికై కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాదికార సమితి రాష్ట్ర నాయకులు కాముని సుదర్శన్ నేత, చింతల శంకర్, రాజయ్య, శ్రావణ్ కుమార్ గౌడ్, జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి రాజేందర్, సదాశివ నగర్ మండల్ ఇన్చార్జి రాజు, కామారెడ్డి పట్టణ నాయకులు అల్వాల గోపాల్, పెంటయ్య, పిట్లం బుబు మేస్త్రి, మహబూబ్, తదితరులు పాల్గొన్నారు.