కుర్మా సంగం ఫంక్షన్ హల్ నిర్మాణానికి శ్రీకారం..

కుర్మా సంగం ఫంక్షన్ హల్ నిర్మాణానికి శ్రీకారం..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనగామ, అక్టోబర్ 24 (ప్రశ్న ఆయుధం):

కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి తన స్వంత నిధులతో కులసంఘాలకు ఇచ్చిన హామీని నెరవేర్చుతూ మరో కీలక అడుగు వేశారు. బీబీపేట్ మండలంలోని జనగామ గ్రామంలో కుర్మా సంఘానికి ఫంక్షన్ హల్ షెడ్డు నిర్మాణానికి ఇంజనీర్ ప్లాన్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు అల్లం ప్రవీణ్, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి నక్క రవీందర్, గ్రామ అధ్యక్షుడు దాకూరి అంబ్రీష్, కుర్మా సంఘ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ కులసంఘాల అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ప్రతి సంఘం సామాజికంగా బలపడేలా తగిన సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామస్థులు ఎమ్మెల్యే సేవాభావాన్ని ప్రశంసిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment