కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే PA అరెస్ట్
కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద పీఏగా పనిచేసిన హరిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని హరిబాబు డబ్బులు వసూలు చేశాడని బాధితులు జీడిమెట్ల పీఎస్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. హరిబాబు రూ.84 లక్షలు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.