సిద్దిపేట సెప్టెంబర్ 23 ప్రశ్న ఆయుధం :
సిద్దిపేట జిల్లా నుండి చలో సంక్షేమ భవన్ హైదరాబాద్ కు బయలుదేరిన కెవిపిఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భక్కెల్లి బాలకిషన్, ఉపాధ్యక్షులు మరాఠి కృష్ణమూర్తి, జిల్లా నాయకులు తలారి దుర్గయ్య, పొట్టోళ్ల దాస్, కాసుల బాలరాజు, ఎడమ వెంకటేష్ లు హైదరాబాద్ సాంఘిక సంక్షేమ భవన్ ముట్టడికి బయలుదేరారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బక్కెల్లి బాలకిషన్ మాట్లాడుతూ జిల్లాలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని కనీస వసతులు లేకుండా బిల్డింగ్లు ఉన్నాయి అని అన్నారు. జగదేవపూర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కొండపాకలో ఒక ప్రైవేట్ బిల్డింగ్ లో కొనసాగుతుందని అక్కడ 600 మంది విద్యార్థులు ఉంటే నాలుగు టాయిలెట్స్ ఉన్నాయని అనేక ఇబ్బందులు పడుతున్నారని చుట్టు ప్రహరీ కూడా లేదని విద్యార్థులకు బాత్రూం డోర్లు లేవని అన్నారు. మర్కుక్ లో ఉన్న పోలీస్ క్వార్టర్స్ భవనాన్ని జగదేవపూర్ బాలికల సోషల్ వెల్ఫేర్ కు కేటాయించారని కానీ బిల్లింగ్ లోకి మార్చడం లేదని అన్నారు. జగదేవపూర్ ప్రిన్సిపాల్ కమిషన్లకు కక్కుర్తి పడి బిల్లింగ్ లకు మారడం లేదని అన్నారు. అధునాతమైన బిల్డింగ్ మర్కుక్ లో ఉందని అక్కడ మారితే పిల్లలకు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చేసుకుని జగదేవపూర్ బాలికల పాఠశాలను మర్కుక్ భవనముల కు తక్షణమే మార్చాలని కోరారు. లేనిపక్షంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మరాటి కృష్ణమూర్తి మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మేస్ ఛార్జ్ 2500 పెంచాలని, డి ఎ హెచ్ విద్యార్థులకు ప్యాకెట్ మనీ రెండు వేల రూపాయలు ఇవ్వాలని, 173 అద్దె భవనాల స్థానంలో సొంతభవనాలు నిర్మించాలని, పెచ్చులు ఊడుతున్న భవనాలను తక్షణమే మరమ్మత్తులు చేపించాలని అన్నారు. విద్యార్థులకు మూడు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేపించాలని, ప్రభుత్వ డాక్టర్ హాస్టల్ విద్యార్థులకు ప్రత్యేక ఇన్చార్జిగా ఉండాలని, సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు. మెనూ అమలుకు టెండర్లు పిలవాలని మెనూ ప్రకటన చేసే సక్రమంగా అమలు చేయాలని అన్నారు. ప్రహరి గోడలు నిర్మించి నైట్ వాచ్ మెన్ సెక్రటరీ నియమించాలని సరిపడా బాత్రూంలో మరుగుదొడ్లు నిర్మించాలని అన్నారు. మినరల్ వాటర్ విద్యార్థులకు అందించాలని అన్నారు. ఖాళీగా ఉన్న హెచ్ డబ్ల్యు ఓ ,ఏ ఎస్ డబ్ల్యూ ఓ పోస్ట్ లను వెంటనే భర్తీ చేయాలని హెచ్డబ్ల్యూ హాస్టల్ కు సమీపంలో స్థానికంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. సంక్షేమ హాస్టల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని అన్నారు. డి ఏ హెచ్ హాస్టల్లో కేటరింగ్ పద్ధతిని తొలగించి రెగ్యులర్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులను నియమించాలని అన్నారు. హాస్టల్ నిర్వహణకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తలారి దుర్గయ్య పొట్టోల దాసు, కాసుల బాలరాజ్ ,ఎడమ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.