*లేబర్ కోడ్లు రద్దు చేయాలి!అసంఘటితరంగ కార్మికులకి సమగ్ర చట్టం తేవాలని కోరుతూ జులై 9వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి!*
*సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి కార్మికులకు పిలుపు!*
పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 22 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరిగే నేపథ్యంలో కొన్ని కారణాలవల్ల జూలై 9 కి వాయిదా పడిన నేపథ్యంలో దేశవ్యాప్త కార్మిక, కర్షక సంఘాలు చేపడుతున్న నిరసనలలో భాగంగా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు కొల్లి సాంబమూర్తి ఆంధ్రప్రదేశ్ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు రామారావు వెంకటేష్ బోడియ రైతు సంఘం నాయకులు గౌరు నాయుడు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, అప్పలనాయుడు భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు గౌరు నాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల పైన కార్మికుల చట్టాలను కాపాడుకునే విధంగా నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసే విధంగా మరియు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం ఆపాలని కార్మికులకు భరోసా కల్పించాలని అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా సంవత్సరానికి ₹200 రోజులు పనితో పాటు రోజు 600 రూపాయలు వేతనం ఇవ్వాలని అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఏమైందని ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరపవలసి ఉండగా అనివార్య కారణాలవల్ల జూలై 9వ తేదీకి వాయిదా పడిందని కాబట్టి ఇలాంటి సందర్భంలో కేంద్రంలో బిజెపి మూడవసారి అధికారం చేపట్టిన తర్వాత కార్మిక చట్టాలన్నింటిని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొస్తున్నారు, లేబర్ కోడ్లు అమలు చేస్తే కనీసం కార్మికులు తమ సమస్యలపై నిరసన కూడా తెలియజేసే అవకాశం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశంలో కనీస వేతనాలు అమలు కాక, ఉద్యోగ భద్రత లేక కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వీరి సమస్యలపై నిరసన తెలుపుకు నే అవకాశం కూడా కోల్పోతారని,
ఇది ఒకరకంగా దేశంలో నిరంకుశ విధానాలను అవలంబించడ మేనని ఆందోళన వ్యక్తం చేశారు అలాగే కార్మికులకు కనీస వేతనం 26000 రూపాయలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని రాజకీయ వేధింపులాపాలని ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు అనగానదేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగవలసి ఉండగా అనివార్య కారణాలవల్ల జూలై 9 కి వాయిదా పడిందని కాబట్టి ఆ రోజు జరిగే సార్వత్రిక , సమ్మె జయప్రదానికి కార్మిక వర్గం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో * రైతులు మరియు* తదితరులు పాల్గొన్నారు….
‘