సివిల్ ఇంజనీర్ కు రావాల్సిన వేతనం ఇప్పించిన కార్మిక నేత రవీ సింగ్

*సివిల్ ఇంజనీర్ కు రావాల్సిన వేతనం ఇప్పించిన కార్మిక నేత రవీ సింగ్*

*ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 21 కుత్బుల్లాపూర్*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇండస్ట్రీ ఏరియాలో “అరుణ్ ప్రాజెక్ట్ మార్క్ ఇంజనీరింగ్ కుత్బుల్లాపూర్ ప్రగతి నగర దగ్గర ఉన్న కంపెనీ లో కొన్ని సంవత్సరాలనుండి సివిల్ ఇంజనీరింగ్ గా పని చేస్తున్న ఎస్.వి. రామ్మోహన్ రావు.

అరుణ్ ప్రాజెక్ట్ మార్క్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులో పని చేస్తున్నారు.

కొన్ని అనివార్య కారణాల వలన ఎస్వి రామ్మోహన్ రావు కు రావలసిన వేతనం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ… 2024 గత సంవత్సరం నుంచి ఏదో ఒక సాకు చెబుతూ నిర్లక్ష్యం చేస్తూ అరుణ్ ప్రాజెక్ట్ మార్క్ ఇంజనీరింగ్, మేనేజర్ లు పంపించేవారు.

అతనికి 2024 గత సంవత్సరం జనవరి నెల 80,000/- రూపాయలు రావాల్సి ఉండగా ఎంత అడిగిన నిర్లక్ష్యం వహిస్తూ పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన సివిల్ ఇంజనీరింగ్ ఎస్ వి. రామ్మోహన్ రావు తమకు తెలిసిన తోటి మిత్రుల ద్వారా మనకు ఎవరైతే న్యాయం చేస్తారో అని తెలుసుకొని బిఆర్టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి సింగ్ గురించి తెలుసుకొని తన కార్యాలయం వద్దకు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించారు.

వెంటనే స్పందించిన కార్మిక నాయకుడు రవి సింగ్. హుటాహుటిన “అరుణ్ ప్రాజెక్ట్ మార్క్ ఇంజనీరింగ్ మేనేజర్ తో పలుమార్లు చర్చించి కార్మికుడికి గత సంవత్సరం జనవరి నెల మొత్తం రావాల్సిన వేతనం, 80,000/- వేల రూపాయలు ఇప్పించారు. సైట్ ఇంజనీర్ ఎస్.వి. రామ్మోహన్ రావు మాట్లాడుతూ నాకు న్యాయం చేసిన రవి సింగ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now