భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంకాకర్ల నుండి నర్సాపురం వరకు రోడ్డుకు ఇరువైపులా దట్టంగా చెట్లు పెరిగి రోడ్డును కమ్ముకోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకంతో పాటు, రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతుండడంతో అప్రమత్తమైన కాకర్ల ఆటో కార్మికులు అందరూ కలిసి మంగళవారం స్వచ్ఛందంగా శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టి రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల పొదలను తొలగిస్తున్నారు. వారు మాట్లాడుతూ దట్టమైన పొదలతో రోడ్డంతా కమ్ముకుపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డుకు ఇరువైపులా పొదలను తొలగించాలని గ్రామ పంచాయతీ అధికారులకు తెలిపినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో , ఆటోలన్నీ నిలిపి అందరం కలిసి స్వచ్ఛందంగా రోడ్డుకు ఇరువైపులా పొదలను తొలగిస్తున్నామని తెలిపారు. వీరి శ్రమదాన ఫలితాన్ని చూసిన పలువురు వాహనదారులు అభినందనలు తెలిపారు.