కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలి సీఐటీయూ డిమాండ్
ధర్నాకు సిఐటియు నాయకులు ప్రభాకర్, కాట్రియాల ప్రభు అధ్యక్షతన వయించారు
ప్రశ్న ఆయుధం 22జులై కామారెడ్డి :
రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆశా వర్కర్లు కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది ఆశ వర్కర్ జిల్లా అధ్యక్షురాలు ఇంద్ర జిల్లా కార్యదర్శి రాజశ్రీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ వర్కర్ పర్మిట్ చేస్తానని మోనో పోస్ట్ లో పెట్టడం జరిగింది ప్రజా పాలన పేరు తోటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటుతున్న ఆశా కార్మికుల సమస్యలు మాత్రం పరిస్కరించడం లేదు అలాగే ఆశ వర్కర్ల పట్ల చిన్న చూపు చూస్తుంది కనీస వేతనం ₹18000 ఇవ్వాలని పిఎఫ్ . ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కల్పించాలని అదన పనులు చేయించవద్దని అధికారుల ఒత్తిళ్లు మానుకోవాలని ఆశ వర్కర్లు ప్రమాదసత్ చనిపోతే వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆశ వర్కర్లు 24 గంటలు పని చేస్తున్న వారికి ఓవర్ టైం కట్టివ్వాలి కరోనా టైంలో ప్రజలంతా ఇంట్లోకి పరిమితమైన ఆశ వర్కర్లు మాత్రం ప్రజలకు సేవ చేసి ప్రజలను కాపాడిన చరిత్ర గుర్తించి ఇండియన్ గ్లోబ్ సంస్థ పంచ ఆరోగ్య (డబ్ల్యూహెచ్ఓ ) ఆశా వర్కర్లకు అవార్డు ప్రకటించింది కానీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆశ వర్కర్ల పట్ల చిన్నచూపు చూస్తుంది ఇప్పటికైనాఆశ వర్కర్లు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని లేనిపక్షంలో సిఐటియూ గా ఎంతటి పోరాడాలని చేస్తామని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 350మంది పాల్గొన్నారు నాయకులు మంజుల. పద్మ. రేణుక. గంగామణి. సుధా. భాగ్యలక్ష్మి. ప్రమీల. లలిత తదితరులు పాల్గొన్నారు.ఆశ యూనియన్
అధ్యక్ష కార్యదర్శులు
ఇంద్ర. రాజశ్రీ కామారెడ్డి