ఫతేనగర్ డివిజన్ ఇందిరా గాంధీ పురoలో బండి రమేష్ పర్యటన
ప్రశ్న ఆయుధం ఆగస్టు 10: కూకట్పల్లి ప్రతినిధి
అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అధికారులను హెచ్చరించారు నియోజకవర్గ పరిధిలోని ఫతేనగర్ డివిజన్ ఇందిరా గాంధీ పురo దగ్గర్లో రూ 60 లక్షలతో నూతనంగా నిర్మితమవుతున్న సిమెంట్ రోడ్డు పనులను అయన పరిశీలించారు డివిజన్ అధ్యక్షుడు స్థానిక నాయకులు ఈ రహదారి నిర్మాణంలో నాణ్యత లోపంతో జరుగుతుందని రమేష్ కి కు ఫిర్యాదు చేయడంతో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి శనివారం పరిశీలించారు అక్కడి నుండే ఈ ఈ శ్రీనివాస్, డి ఈ ఆనంద్, ఏఈ పవన్ లతో ఫోన్లో మాట్లాడి రహదారి నిర్మాణ నాణ్యత పై ప్రశ్నించారు. దీనిపై క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ తమకు అందజేయాల్సిందిగా సూచించారు. బస్తిలోని మంచినీటి సమస్యపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య నాగిరెడ్డి రమేష్ బాకీ వరహాలస్వామి జ్యోతి తదితరులు పాల్గొన్నారు