ఇదేనా ప్రజాపాలన….?

ఇదేనా
Headlines:
  1. “లగచర్ల భూముల కోసం పోరాటం: మహిళా నేతల నిరసనకు పోలీసుల అడ్డంకి”
  2. “ప్రజా పాలనపై ప్రశ్నలు: లగచర్ల భూ వివాదంలో పోలీసుల నిర్బంధ చర్య”
  3. “సిపిఐ (ఎం-ఎల్) డిమాండ్: ఫార్మా కంపెనీ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దు”
  4. “వికారాబాద్ జిల్లా: భూముల రక్షణ కోసం ప్రజల పోరాటం కొనసాగుతూనే ఉంది”
  5. “మహిళా జేఏసీ బృందాన్ని తిరస్కరించిన పోలీసులు: చట్టవిరుద్ధ చర్యగా విమర్శలు”
వికారాబాద్ జిల్లా లోని లగచర్ల వెళ్లకుండా వివిధ మహిళా సంఘ నేతల్ని  టుంకిమెట్ల వద్ద పోలీసులు అక్రమంగా అడ్డుకున్నారు. ప్రొఫెసర్ పద్మజా షా,POW జాతీయ కన్వీనర్ వి. సంధ్య, ఝాన్సీలతో పాటు సజయ, అనసూయ, జ్యోతి, శ్రీదేవి, గీత తదితరులను పోలీసులు అడ్డగించబూనుకోవడం అప్రజాస్వామికం, చట్టవిరుద్ధం గా సిపిఐ (ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ భావిస్తున్నది. ఇదేనా ప్రజా పాలనా?

లగచర్ల పరిసర గ్రామాల ప్రజలు తమ గ్రామాలకు చెందిన భూముల్ని ఫార్మా కంపెనీలకు ఇచ్చేది లేదని గత ఆరు నెలలుగా తెగేసి చెప్తూ వస్తున్నారు. అయినా రేవంత్ సర్కార్ ఈ భూములను ఇవ్వాల్సిందే అనే వైపుగా బలవంతపు ప్రయత్నాల్ని సాగించడం లో భాగంగానే కలెక్టర్, ఇతర అధికారుల పై ఇటీవల దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే!

ఈ నేపథ్యంలోనే ఈ రోజు మహిళా జేఏసీ తరపున హైదరాబాద్ నుండి లగచర్ల కు వెళ్తున్న నిజనిర్ధారణ బృందాన్ని పోలీసులు అడ్డగించి, వారిని తిరిగి బలవంతం గా హైదరాబాద్ కు తరలించడం నిరంకుశ విధానమే అవుతుంది. ప్రజా పరి పాలన సాగిస్తున్నామని ఏడాది సంబురాల్ని ప్రారంభించిన రోజే ఈ రక మైన నిర్భందాన్ని అమలు జరుపడం ఈ ప్రభుత్వ నిరంకుశ స్వభావానికి అద్దం పడుతున్నది. నిన్న రాత్రి నర్సంపేట ప్రాంతం లో రంగయ్య చెరువు ను 11 గ్రామాల్ని ముంచే రిజర్వాయర్ గా మార్చరాదనీ అక్కడి ప్రజలు ఆందోళనకు దిగితే, అక్కడి ప్రజల్ని అర్థరాత్రి అరెస్ట్ చేశారు.ఇలా ఏడవ హామీగా ఇచ్చిన ప్రజా పాలన ఒట్టిదేనని రేవంత్ సర్కార్ నిరూపించుకుంటున్నది.

లగచర్ల లో ఫార్మా కంపెనికి అనుమతి ఇవ్వొద్దని మా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ఇలా డిమాండ్ చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తూ నిర్భందాన్ని ప్రయోగించడాన్ని వెంటనే ఉపసంహారించుకోవాలని కోరుతున్నాం.

 

కె. గోవర్దన్

రాష్ట్ర నాయకులు సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ

19-11-2024

Join WhatsApp

Join Now

Leave a Comment