లగచర్ల ఘటనలో అమాయక గిరిజన రైతులను బలి చేయకండి

గిరిజన
Headlines in Telugu
  1. లగచర్ల ఘటన: గిరిజన రైతుల న్యాయ పోరాటానికి మద్దతుగా ఎస్సీ ఎస్టీ కమిషన్
  2. పోలీస్ హింసపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్ బక్కి వెంకటయ్య
  3. గిరిజన రైతుల భూములపై అక్రమంగా హస్తక్షేపం ఆపాలని డిమాండ్
  4. లగచర్ల ఘటనపై విచారణ: బాధిత రైతులకు న్యాయం చేస్తామని కమిషన్ హామీ

సిద్దిపేట నవంబర్ 17 ప్రశ్న ఆయుధం :

పొలీస్ హింసకు గురైన బాధితులకు వైద్య శిబిరం ఏర్పాటు చేయండి.

వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పిలను ఆదేశించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశం

లగచర్ల ఘటనలో అమాయక గిరిజన రైతులను వేధింపులు ఆపాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వికారాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పిలను ఆదేశించారు.బాధిత రైతులు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలిసి తమ వ్వవసాయ భూములను బలవంతంగా గుంజుకుంటున్నారని,కలెక్టర్ పై దాడి సాకు తో పోలీసు లు అమాయక రైతులను అరెస్టు చెస్తు వెధిస్తున్నారని పిర్యాదు చేయగా స్పందించిన చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదివారంనాడు జిల్లా కలెక్టర్, ఎస్పిలకు పొన్ చెసి లగచర్ల సంఘటన పై అరా తీశారు.. గిరిజన రైతుల సాగు భూములను స్వాధీనం చెసుకుంటె ఎమి చెసి బతుకుతారని కలెక్టర్ ను ప్రశ్నించారు.ఫార్మా కంపెనీలకు పడావు భూములలో ఏర్పాటు చెయవచ్చు కదా అన్నారు.పొలీసుల చిత్రహింసలకు గురైన బాధితులకు వైద్య శిబిరం ఏర్పాటు చెసి వైద్య సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ను ఆదేశించారు. అమాయక రైతులను వెధించవద్దని అక్రమంగా అరెస్టు చెయవద్దని జిల్లా ఎస్పీ ని ఆదెశించారు.లగచర్ల ఘటన పై రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ కమిషన్ కు పూర్తి నివేదిక అందజేయాలని కమిషన్ త్వరలో లగచర్ల లో పర్యటించి బాధిత రైతులను విచారిస్తామని అధికారులకు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment