లక్ష డప్పులు వెయ్యి గొంతులుగా తరలి రావాలి
యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 04
మాదిగ రిజర్వేషన్ ఏబీసీడీ వర్గీకరణ అమలుకై జరిగే పోరాటంలో భాగంగా లక్ష డప్పులు వెయ్యి గొంతుల మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం కోరుతూ రాజపేటలో మంగళవారం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. రాజాపేట మండలాధ్యక్షుడు మోత్కూపల్లి నవీన్ కుమార్ అధ్యక్షతన నర్సాపురం గ్రామాంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ విగ్రహం వద్ద గోడ పత్రిక ఆవిష్కరించారు.ఈ కార్యమానికి లక్షలాదిగా మాదిగలు మాదిగ ఉపకులాల ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి బీసీ సంఘo రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుకంటి ప్రవీణ్ వర్గీకరణ అమలుకు సంపూర్ణ మద్దతు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.పి.ఎస్. జిల్లా నాయకులు ఎర్రగుంట ప్రభాకర్ మాదిగ,ఎం.ఈ.ఎఫ్. జిల్లా అధ్యక్షులు ఇంజ మహేష్ మాదిగ,దుబ్బాసి శ్రీను మాదిగ,ప్రకాష్ మాదిగ,గోల్లూరి ప్రభాకర్ మాదిగ,ముక్క రవిప్రకాష్ మాదిగ,రాంగళ్ళ శీను మాదిగ,దగ్గుల విష్ణు మాదిగ,రాంగళ్ళ అమరేందర్ మాదిగ,దుబ్బాషి గణేష్ తదితరులు పాల్గొన్నారు.