హుజురాబాద్ లో లక్ష డప్పులు వెయ్యి గొంతుకల గోడ ప్రతుల ఆవిష్కరణ
*హుజురాబాద్ ఫిబ్రవరి 2 ప్రశ్న ఆయుధం*
మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ అమలుకు ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే చారిత్రాత్మక లక్ష డప్పులు వెయ్యి గొంతుకల మాదిగల సాంస్కృతిక మహా ప్రదర్శన గోడ ప్రతులు, కరపత్రాలను ఆదివారం హుజురాబాద్ లో అంబేద్కర్ చౌరస్తా దగ్గర లక్ష డప్పులు వేల గొంతుల హుజురాబాద్ మండల అధ్యక్షుడు ఎర్ర శ్రీధర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు హాజరైన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ల ఫలాలు 59 ఉపకులాల ప్రజలందరికీ దక్కే విధంగా ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు ఆగస్టు నెలలో సమర్థిస్తూ తీర్పునిచ్చిందని ఈ తీర్పును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేసి షెడ్యూల్డ్ కులాల ప్రజలందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రపంచ చరిత్రలో నిలిచే లక్ష డప్పులు వేల గొంతుల మాదిగల మహా ప్రదర్శనకు హుజురాబాద్ డివిజన్ లో అన్ని గ్రామాల నుండి మాదిగ జాతి ప్రజలందరూ అధిక సంఖ్యలో డప్పు సంకన వేసుకొని హైదరాబాద్ కు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకులు వర్ధినేని రవీందర్ రావు, ఎమ్మెస్పి రాష్ట్ర నాయకుడు మారేపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్, లక్ష డప్పులు వేల గొంతుల హుజురాబాద్ డివిజన్ అధ్యక్షురాలు ఆకినపల్లి శిరీష, డివిజన్ ఇంచార్జ్ తుంగ ఆంజనేయులు, డాక్టర్ తడికమళ్ళ శేఖర్, బొడ్డు ఐలయ్య, బొరగాల సారయ్య, ఎర్ర రాజ్ కుమార్, ఎర్ర నాగరాజు, వేల్పుల రత్నం, మొలుగు శ్రీనివాస్, మోరే మధు, ఆకినపల్లి ప్రవీణ్, మొలుగు అనిల్, కలకోటి శ్రీనివాస్ మరియు డప్పు కళాకారులు తదితరులు పాల్గొన్నారు