రాజన్న గారి లక్ష్మికి కామారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద గల లక్ష్మీ గణపతి గుడికి సంబంధం లేదు
– విచారణ చేసి భక్తులకు న్యాయం చేయాలి
– జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవోలకు వినతి పత్రం ఇచ్చిన భక్తులు
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
కామారెడ్డి కొత్త బస్టాండ్ ముందర ఉన్న లక్ష్మి గణపతి
దేవాలయానికి రాజన్న గారి లక్ష్మికి వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని అయినప్పటికీ వారు ఆ గుడి మాదే నంటూ దౌర్జన్యం చేస్తున్నారని కామారెడ్డికి చెందిన కొందరు భక్తులు బుధవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, కామారెడ్డి డివిజన్ ఆర్డీవోలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కామారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద గల లక్ష్మీ గణపతి దేవాలయానికి వెనుక ఉన్న దుకాణ యజమాని రాజన్నగారి లక్ష్మి ఈ గుడి మాదే అని నా భర్త కట్టించినాడు, కాబట్టి గుడికి వచ్చే భక్తులు హుండీలో వేసే డబ్బులు, హారతి పళ్ళెంలో వేసే డబ్బులు ఆమెనే తీసుకుంటున్నది. ఈ విషయమై ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు మద్దతుగా బుధవారం గుడి లోపల కూర్చున్నారనీ, ఈ గుడిలో పంతుల్లను వేధిస్తున్నదన్నారు. బుధవారం మేము గుడి వద్దకు వెళ్ళగా రాజన్న గారి లక్ష్మి, ఆమె కొడుకు శ్రీకాంత్, ఆమె కూతురు పద్మ, వారి బంధువు వరాలు లు మమ్మల్ని భూతు మాటలు తిడుతూ ఒకొక్కరి సంగతి చూస్తా అని బెదిరించినారు. ఈ గుడి ప్రభుత్వ స్థలములో ఉన్నందున గుడికి వచ్చే భక్తుల చందాలతో గుడి నిర్మాణము జరిగినందున ఈ విషయమై విచారణ జరిపి, ఈ గుడిపై రాజన్నగారి లక్ష్మి కి ఎలాంటి హక్కు లేదు అని తెలిపి, భక్తులకు న్యాయం చేయగలరు అని కోరుచున్నాము అన్నారు. ఆ గుడి వారిదేనని తెలిపే ఏవైనా పత్రాలు వారి వద్ద ఉంటే వాటిని చూసి, ఆ గుడివారీదా ఆ స్థలం ప్రభుత్వానికి చెందినదా అని విచారణ చేసి న్యాయం చేయాలని కామారెడ్డి భక్తులు కోరుతున్నారు.