రెసిడెన్షియల్ పాఠశాల & జూనియర్ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
కామారెడ్డి జిల్లా జుక్కల్ ఆర్సీ ప్రశ్నఆయుధం ఆగస్టు 12
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలకేంద్రంలోని మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాల& జూనియర్ కళాశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే కు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు..పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి,టాయిలెట్స్, త్రాగునీరు వసతి గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు..విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు పట్టిక మరియు డైట్ మెనూను పరిశీలించారు.విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ముచ్చటిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు..పాఠశాలలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని,చిన్న చిన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు..విద్యార్థులు కష్ట పడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని,అర్థాంతరంగా చదువులు ఆపకూడదని చెప్పారు..చదువు ఒక్కటే మన జీవితాలను మారుస్తుందని, సమాజంలో మనకు గుర్తింపు, గౌరవం ఇస్తుందని తెలిపారు..ప్రజా ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని,మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ వహించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు..కాబట్టి ప్రతీ ఒక్కరూ ఉన్నత లక్ష్యాలు ఏర్పర్చుకొని కష్టపడి చదివి రాణించాలని చెప్పారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల&కళాశాల సిబ్బంది,మండల అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.