లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న గౌడ మహిళా సంఘ ఉపాధ్యక్షురాలు..

ఉపాధ్యక్షురాలు..

లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న గౌడ మహిళా సంఘ ఉపాధ్యక్షురాలు..

మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని మంగళవారం గౌడ మహిళా సంఘ ఉపాధ్యక్షురాలు వీరబోయిన రజిత (అంజలి) దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం ద్వారా శ్రద్ధ, భక్తి మరింత పెంపొందించుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు.

ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు అందజేశారు. రజితను సన్మానిస్తూ శాలువాతో సత్కరించి, స్వామి వారి చిత్రపటాన్ని భక్తిపూర్వకంగా అందించారు. గౌడ మహిళా సంఘంలో తన బాధ్యతలతో పాటు, ఆమె ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారని ఆమె సమీప బంధువులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌడ ప్రతినిధులు ఈసాయిపేట మాజీ సర్పంచ్ బాలగౌడ్, టెంపుల్ ఏవో ప్రభు, సంతోష్, ఇతర గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక పరంపర:

చుక్కాపూర్ అటవీ ప్రాంతంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఎంతో విశిష్టతను కలిగి ఉంది. గౌడ సమాజం తరచుగా ఇక్కడ పూజలు నిర్వహిస్తూ, వారి సంప్రదాయాలకు అనుగుణంగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతున్నారు..

Join WhatsApp

Join Now