కొట్టాలపల్లి, లింగాయపల్లి గ్రామాలలో వడ్ల కొనుగోలు పూర్తి
– మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి రాజగౌడ్
– కామారెడ్డి
కామారెడ్డి మండలంలోని కొట్టాలపల్లి, లింగాయపల్లి గ్రామాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు విజయవంతంగా పూర్తయిందని కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీరాజ గౌడ్ అన్నారు. ఈ రెండు గ్రామాలలో 9,29,640 కిలోల వడ్లు కొనుగోలు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ సర్పంచ్ కిషన్ గౌడ్, మాజీ సర్పంచ్ మంజుల బాలయ్య, ఉపసర్పంచ్ రాజయ్య, గ గ్రామ సంఘం అధ్యక్షులు విజయ, రెండు గ్రామాల పెద్దలు, రైతులు, ఐజేపి సిబ్బంది సీసీ విశ్వనాథం, వివోఏ రాజలింగం, సంగీత, ఎస్ బి కే రాదిక తదితరులు పాల్గొన్నారు.