సాంప్రదాయ పద్ధతిలో లంభోదరు ని శోభయాత్ర

*భక్తి భావంతో ఘననాధునికి వీడ్కోలు*

 

*సంప్రదాయ పద్దతిలో భజన పాటలతో లంబోదరుని శోభయాత్ర*

 

*పదకొండు రోజులుగా ఎలాంటి డిజే పాటలు లేవు. ఓన్లీ భజన కార్యక్రమాలతో పూజలు అందుకున్న వినాయకుడు*

 

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్-18

 

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం లోని కుర్తి గ్రామం లో

మొత్తం 6 చోట్ల వినాయకులను పెట్టడం జరిగింది.

అయితే ఐదు రోజుల నాడు

ఒక వినాయకుని నిమజ్జనం చేశారు. తొమ్మిది రోజుల నాడు 4 వినాయకులకు నిమజ్జనం చేశారు. చివరగా

గ్రామ హనుమాన్ మందిరం వద్ద ఏర్పాటు చేసిన ఘననాదునికి గత 11 రోజులుగ ఎలాంటి కలిబొల్లి డిజే పాటలు లేకుండా ఒక భక్తి భావం తో భజన కార్యక్రమాల ద్వారా పూజలు నిర్వహించి నిన్న సాయంత్రం అన్నదానా కార్యక్రమం ఏర్పాటు చేసి. గ్రామస్తుల అందరికి వినాయకుని ప్రసాదాలను అందజేశారు. ఎక్కడలేని విదంగా దేశప్రజల కు, నేటి యువతకు ఒక కనువింపు కలిగేలా భగవంతుణ్ణి ఎలా పూజించాలి, ఏవిదంగా నిమజ్జనం చేయాలి అనేది కనులకు కట్టినట్టుగా ఎర్రటి ఎండలో సైతం వివిధ గ్రామాల నుండి భజన కళాకారులను తీసుకువచ్చి భజన పాటలతో ఘననాదుని శోభయాత్ర నిర్వహించి. మంజీరా నదిలో నిమ్మజనం చేయడం జరిగింది.

ఇది చూసిన గ్రామ ప్రజలు అందరు భక్తి తో పరవశించి చిపోయారు.

హన్మన్ మందీర్ వద్ద ఏర్పాటు చేసే ఇ ఘననాదునికి ప్రతి సంవత్సరం ఇదే విదంగా శోభయాత్ర నిర్వహించి. నిమజ్జనం చేస్తాము అని గ్రామ పెద్దలు,పూజారి తెలిపారు.

Join WhatsApp

Join Now