రోడ్డు కోసం భూమిని ఇవ్వడానికి ముందుకు వచ్చిన భూ యజమానులు
– అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందించిన భూ యజమానులు
– 132 కెవి హెచ్ టి లైన్ కు ఇరుపక్కల 83 ఫీట్ల రోడ్డు నిర్మాణానికి మార్కింగ్ ఇప్పించాలంటూ వినతి
ప్రశ్న ఆయుధం న్యూస్, డిసెంబర్ 10, కామారెడ్డి :
కామారెడ్డి పట్టణంలోని కామారెడ్డి సబ్ స్టేషన్ నుండి లింగపూర్ శివారులోని బృందావన్ గార్డెన్ వరకు దేవునిపల్లి, లింగాపూర్ శివారులో లే అవుట్లు చేస్తున్న భూ యజమానులు 132 కెవి హై టెన్షన్ వైర్ కింద 83 ఫీట్ల రోడ్డు వేయటానికి తమ భూములు మున్సిపల్ కి గిఫ్ట్ డీడ్ చేయడానికి అంగీకారం తెలుపుతున్నామని జిల్లా కలెక్టర్, అడీషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లకు మంగళవారం వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఈ ప్రాంతంలో హై టెన్షన్ విద్యుత్ తీగలు ఉన్నందున 83 ఫీట్ల రోడ్డు వేయాలని గతంలో కామారెడ్డి శాసన్న సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి విజ్ఞప్తి చేసారని, ఈ విషయంలో వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులు 83 ఫీట్ల రోడ్డుకి మార్కింగ్ చేయాలని తెలిపారు. కామారెడ్డి సబ్ స్టేషన్ నుండి పాత జాతీయ రహదారి వరకు అనుసంధాన రోడ్డు నిర్మిస్తే పట్టణంలో ట్రాఫిక్ సమస్య కొంత వరకు తగ్గటమే కాకుండా నిజామాబాద్ వైపు వెళ్లే వారికి గమ్యస్థానం చేరటం సులభ తరం అవుతుందని కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డికి తెలిపారన్నారు. రోడ్డు కోసం భూమిని ఇవ్వడానికి ముందుకు వచ్చిన లింగాపూర్ భూ యజమానులు కొమిరెడ్డి మారుతి ,పాత లక్ష్మణ్ లకు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.