Site icon PRASHNA AYUDHAM

లాంగ్వేజ్ 64వ ఆవిర్భావ దినోత్సవం

*ఘనంగా యూత్ కాంగ్రెస్ 64వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 9*

జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ 64వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ కార్యనిర్వాహక అధ్యక్షులు సజ్జాద్ మొహమ్మద్ యూత్ కాంగ్రెస్ 64వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు.
అనంతరం ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వై థామస్ కేక్ కట్ చేసి స్వీట్లు అరటి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని అనేకమంది యువత అంతా కూడా యూత్ కాంగ్రెస్ చేసినటువంటి ఉద్యమంలో అనేక మంది మహానేతలు ఎందరో తయారై దేశానికి అందించిన యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులుగా దేశానికి సేవ చేసిన సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ దేశ సేవలో అనేక మందిని అందించిన యూత్ కాంగ్రెస్ లో నేడు మేము పనిచేయడం చాలా గర్వాంగా ఉందన్నారు.రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువత పైన తీసుకున్నటువంటి నిర్ణయాలను తూచా తప్పకుండా అమలు పరచడంలో యూత్ కాంగ్రెస్ ముందు ఉంటుందని అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ద్వారా వారు ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ విధంగా ప్రిపేర్ కావాలో దిశా నిర్దేశం సూచించినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అని మాట ఇస్తే మాట తప్పని కాంగ్రెస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ హుజరాబాద్ నియోజకవర్గం కార్యనిర్వహక అధ్యక్షులు సజ్జద్ మొహమ్మద్ ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వై థామస్ కల్లపల్లి వినోద్ పర్లపల్లి నాగరాజు రోమాల రాజ్ కుమార్ జపానియా శ్యామ్ వోల్లాల రాజేష్ గొడుగు మానస గాలిబు నరేష్ పంజాల అజయ్ ఫయాజ్ మహమ్మద్ సాగర్ సోహెల్ అరుణ్ దాసరపు రాకేష్ రామకృష్ణ వెంకటేష్ మోహన్ రెడ్డి ప్రదీప్ రెడ్డి వడ్లూరి అరుణ్ సల్లు బాబా అంజి పెద్ది శివ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version