ఓటుకు నోటు కేసులో తాజాగా సుప్రీంకోర్టులో కీలక పరిణామం..

ఓటుకు నోటు కేసులో తాజాగా సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఎవరూ కూడా పాల్గొనకూడదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తన తీర్పులో, రేవంత్ రెడ్డికి సంబంధించిన ఈ కేసులో పోలీసులు జోక్యం చేసుకోకూడదని, విచారణ పారదర్శకంగా జరగాలని పేర్కొంది. ఈ కేసు డిస్మిస్ కాకుండా, డిస్పోస్ మాత్రమే అయిందని తెలిపింది. అంతే కాకుండా, ఏసీబీ డీజీ ఈ కేసులో స్వతంత్రంగా వ్యవహరించాలనీ, రేవంత్ రెడ్డికి ఏదైనా కేసు సంబంధిత విషయాలు తెలిపినట్టు తేలితే పిటిషనర్ మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని కోర్టు సూచించింది.

Join WhatsApp

Join Now