పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో జస్టిస్ విజయసేన్‌రెడ్డి బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను నిర్దిష్ట సమయంలోగా పరిష్కరించాలని స్పీకర్‌కు గడువు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని దీనిపై మీ వైఖరి చెప్పాలని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది.అయితే స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేయరాదన్నదే తమ వాదన అని అడ్వకేట్ జనరల్ వాదించారు.సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం ఉత్తర్వుల ప్రకారం ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై పిటిషన్లను మూడు నెలల్లోగా పరిష్కరించాలని బీఆర్ఎస్ తరపు లాయర్లు వాదించారు.అయితే బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని, కోర్టు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని ప్రభుత్వ లాయర్ వాదించారు..
ఎమ్మెల్యేలపై పిటిషన్లను మూడు నెలల్లోగా పరిష్కరించాలని బీఆర్ఎస్ తరపు లాయర్లు
by admin admin
Published On: August 7, 2024 10:40 pm