న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ కార్పస్ ఫండ్ ను 100 కోట్ల నుంచి 500 కోట్లకు పెంచాలని

ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 21 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అందచేసే వినతి పత్రం పై న్యాయవాదుల సంతకాలను ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఏ.ఐ.ఎల్.యు. బాధ్యులు కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో సేకరించారు.

తెలంగాణ రాష్ట్రంలోని న్యాయవాదులకు 2019 లో జాబితాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర అడ్వకేటస్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు మెడికల్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులు న్యాయవాదులకు జారీ చేస్తున్నారని, 2019 తరువాత చనిపోయిన న్యాయవాదుల పేరిట కూడా ప్రీమియం చెల్లిస్తూ కార్డులు జారీ చేస్తున్నారని, దీనివల్ల ఇన్సూరెన్స్ కంపెనీకి లాభం, న్యాయవాదులకు నష్టం కలుగుతున్నదని,కనుక ప్రస్తుతం న్యాయవాదులుగా కొనసాగుతున్న వారి జాబితాను, అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు బార్ కౌన్సిల్ నుంచి తెప్పించుకొని, బార్ అసోసియేషన్ల నుండి ఖాయం చేసుకొని, చనిపోయిన వారి పేర్లను తొలగించాలని, 2019 తరువాత నమోదైన న్యాయవాదులందరికి మెడికల్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులు జారీ చేయాలని ఏ.ఐ.ఎల్.యు. నాయకులు డిమాండ్ చేశారు.

ప్రస్తుతమున్న రెండు లక్షల రూపాయల భీమా పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచాలని, న్యాయవాదుల తల్లి తండ్రులకు కూడా హెల్త్ కార్డులు జారీ చేయాలని, ప్రసవం తో సహా అన్ని చికిత్సలకు హెల్త్ కార్డులు వర్తింప చేయాలని, చనిపోయిన న్యాయవాదులకు కూడా పది లక్షల రూపాయలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, వయోపరిమితితో నిమిత్తం లేకుండా న్యాయవాద కుటుంబ సభ్యులందరికీ హెల్త్ కార్డులు జారీ చేయాలని, తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమ ట్రస్టు ఉన్న 100 కోట్ల రూపాయల పై వచ్చే వడ్డీ హెల్త్ కార్డుల జారికి సరిపోనందున మరొక 400 కోట్ల రూపాయలు న్యాయవాదుల సంక్షెమ ట్రస్టు కు కేటాయించాలని, వినతి పత్రంలో కోరారు.ఈ కార్యక్రమంలో ఏ.ఐ.ఎల్.యు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ మక్కడ్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు జె.శివరాం ప్రసాద్, కొర్టీ కమిటీ కార్యదర్శి కిలారు పురుషోత్తం రావు, రాష్ట్ర మహిళా కన్వినింగ్ కమిటీ సభ్యురాలు గాదె సునంద, జిల్లా కమిటీ సభ్యులు అరికాల రవి కుమార్, డి.రవి కుమార్, కోర్టు కమిటీ సభ్యులు డి. రాజేందర్, సీనియర్ న్యాయవాది వై.వి. రామారావు, న్యాయవాదులు ఏ.పద్మ కళ, పగిడిపల్లి రవి, బి.దేవదాసు, వి.రామకృష్ణ, కె.మహేష్ ఆనంద్, డి.సుబ్రమణ్యం, సి.హెచ్. విజయ్ కుమార్, వై. జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now