సామాన్య రైతుల ప్లాట్లలో నుండి 100 ఫీట్ల రోడ్లు వేయడం దౌర్జన్యం

సామాన్య రైతుల ప్లాట్లలో నుండి 100 ఫీట్ల రోడ్లు వేయడం దౌర్జన్యం

– ప్రభుత్వ అవసరాలకు ప్రభుత్వ భూమిని తీసుకోరు

– సామాన్య రైతులవి భూములు తీసుకోవడం మాత్రం ప్రభుత్వానికి చెల్లుతుందా

– తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి

 ప్రశ్న ఆయుధం,కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి 1: 

సామాన్య రైతుల భూములను రోడ్ల పేరుతో ప్రభుత్వం బడా బాబులు లాక్కోవడం దౌర్జన్యమే అవుతుందని

తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతి రామ్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రికి రాత్రే రైతులకు తెలియకుండా వారి భూములలో రోడ్లు వేయడం పెద్ద తప్పు అన్నారు. బుధవారం రైతు సంఘాల నాయకులు పేదల రైతు పొలాల నుండి దౌర్జన్యంగా వేసిన భూమి ప్రాంతాన్ని సందర్శించామన్నారు. బడా బాబుల వెంచర్ కోసం వాళ్ళ లాభర్జన కోసం రైతులకు సమాచారం లేకుండా వంద ఫీట్ల రోడ్లు వేయడం ప్రభుత్వ అధికారులు బడా బాబులకు కొమ్ము కాయడమే తప్ప మరొకటి ఉండదని అన్నారు. సుమారు 50 మంది సామాన్యు రైతులు ఈ రోడ్డు వల్ల నష్టపోతున్నారని అన్నారు. వాళ్లకు నష్ట పరిహారం ఇవ్వకుండా బెదిరింపులతో రోడ్లు వేస్తే తెలంగాణ రైతు సంఘం చూస్తూ ఊరుకోదని వాళ్లకు అండంగా నిలుస్తామని అన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ అవసరం కోసం దోమకొండ మండలం బిబిపేట మండలం మధ్యలో గల పాల్వంచ నుండి జనగామ కు వెళ్లే రోడ్డును వెడల్పు చేసే క్రమంలో గత నాలుగు ఐదు సంవత్సరాలుగా అటవీశాఖ అధికారులు ఒప్పుకోవడం లేదని నేపథంతో 600 మీటర్ల వరకు రోడ్డు వెడల్పు పనులు ఆగిపోయాయని తద్వారా అక్కడ ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతున్న ప్రభుత్వ అధికారులు కానీ బడా బాబులు గాని పట్టించుకోవడం లేదన్నారు. అలాంటిది ఈ ప్రాంతంలో వెంచర్ వేస్తున్న బడా బాబుల కోసం వారికి ప్రభుత్వ అధికారులు సహకరిస్తూ పేదల భూముల నుండి రోడ్లు వేయడానికి అక్రమంగా వారి భూములను కబ్జా చేస్తున్నారన్నారు.

రైతులతో చర్చించకుండా మొండిగా వ్యవహరిస్తే రైతు సంఘాలు రైతులను ఏకం చేసి కలెక్టర్ కార్యాలయం ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ రోడ్డు విషయంలో ఇంతకుముందే అనేక పోరాటాలు జరిగినయని వీటిపై ఎమ్మెల్యే కూడా గెలిచారని అటువంటిది ఆ ఎమ్మెల్యే మర్చిపోకూడదని అన్నారు. ఎప్పటికీ రైతు సంఘాలు రైతు వెంట ఉంటుందని ప్రభుత్వాధికారులు కాంట్రాక్టర్లు గుర్తించాలని అన్నారు. అక్కడ గజాన 12,000 నుండి 14,000 వరకు నడుస్తుంది కానీ రైతులకు రెండు నుంచి మూడు వేలు ఇస్తామని అనడం మంచిది కాదని అన్నారు. బడా బాబులు వాడే వారి వెంచర్లలో కోట్ల రూపాయల లాభాన్ని ఆశించి వెంచర్లు వేస్తున్నారని అలాంటిది రైతులకు నష్టపరిహారం ఇస్తే వారికి వచ్చే నష్టమేమిటన్నారు. వెంటనే ప్రభుత్వం కాంట్రాక్టర్ల, ప్రజాప్రతినిధుల, రైతుల సమస్యలను గుర్తించి వాళ్ళ బాధలను గుర్తించి వాళ్లతో చర్చించి ఆల భూముల రోడ్డు తీస్తే మంచిది కాదు మేము చెప్పింది వేదం అనుకుంటే మాత్రం తెలంగాణ రైతు సంఘం ఇతర సంఘాలను కూడగట్టుకుని పోరాటాలు మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జిల్లా నాయకులు ప్రకాష్ నాయక్, రాజేందర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now