ప్రజా ఉద్యమాల సారథి సిపిఎం పార్టీ జిల్లా 3 వ మహాసభలను జయప్రదం చేయండి 

ప్రజా ఉద్యమాల సారథి సిపిఎం పార్టీ జిల్లా 3 వ మహాసభలను జయప్రదం చేయండి

సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బండ్ల స్వామి పిలుపు 

గజ్వేల్ నవంబర్ 26 ప్రశ్న ఆయుధం :

ప్రజా ఉద్యమాలే ఊపిరిగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం సిద్దిపేట జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు గజ్వేల్ లోని స్థానిక సిఐటియు కార్యాలయంలో సత్య సూర్య అల్యూమినియం ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ సిఐటియు యూనియన్ కార్యవర్గ సమావేశంలో మహాసభల కరపత్రం విడుదల అనంతరం అతను మాట్లాడుతూ గజ్వేల్ పట్టణం లోని సీతారాం ఏచూరి ప్రాంగణం కోలాభి రామ్ గార్డెన్ లో 2024 డిసెంబర్ 1-2 తేది లలో జరిగే సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు జరుగుతున్నాయని వీటిని జయప్రదం చేయడానికి అన్ని రంగాల కార్మిక వర్గం, ప్రజలు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున తరలిరావాలని, సహాయ సహకారాలు అందించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకృత ఆర్థిక విధానాల వలన ప్రజలపై అనేక భారాలు పడుతున్నాయని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఈ పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగాన్ని మొత్తం ధ్వంసం చేసి దేశ సంపదను బడా కార్పోరేట్ పెట్టుబడిదారులకు దోచిపెడుతుందని అన్నారు. స్వాతంత్రం పూర్వం, స్వాతంత్రానంతరం కార్మిక వర్గం పోరాటాల ద్వార సాధించుకున్న చట్టాలను రద్దుచేసి లేబర్ కోడ్ లుగా మార్చారని తద్వారా కార్మికులకు ఉద్యోగ భద్రత, పని భారం పెరగడం జరిగిందని యూనియన్ల యొక్క బేర సారాల శక్తి తగ్గుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ చట్టాలను అమలు చేయకూడదని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు సిద్దిపేట జిల్లాలోని అన్ని వర్గాల, తరగతుల ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్మిక, రైతు, వ్యవసాయ కూలీలు, విద్యార్థి,యువజన, మహిళల,వృత్తిదారుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని చట్టప్రకారం ఇవ్వాల్సిన పరిహారం హక్కుల అమలు కోసం, సిద్దిపేట జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఇప్పుడు జరిగే జిల్లా మహాసభలు తగిన కార్యాచరణను రూపొందించి అమలు కోసం పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు ఈ సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఇరబోయిన సురేష్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ అంకం రవిరాజ్, యూనియన్ నాయకులు గోదాల అశోక్, ఎండి సద్దాం, కామల మల్లేశం, కార్మికులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now