ముంబాజిపేటలో వివిధ పార్టీలు వీడి నేతలు, కార్యకర్తలు టిడిపిలో చేరిక

ముంబాజిపేటలో వివిధ పార్టీలు వీడి నేతలు, కార్యకర్తలు టిడిపిలో చేరిక

కాశీరాం, గోపాల్, సాయిలు, గంగారం, నారాయణ తదితరులు టీడీపీ కండువా కప్పుకున్నారు

“అభివృద్ధి అంటే టిడిపే” అని ప్రకటించిన నాయకులు

నందమూరి తారకరామారావు పాలనలో ప్రారంభమైన సంక్షేమ పథకాలను స్మరించిన భీమ్రావు

రాబోయే ఎన్నికల్లో జెండా ఎగరేస్తామని సంకల్పం

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 18

ముంబాజిపేట గ్రామంలో ఆదివారం గ్రామ పెద్దలు, వివిధ పార్టీ నాయకులు ఘనంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాశీరాం, గోపాల్, జి.సాయిలు, టీ.గంగారం, హెచ్.నారాయణ, బోయిని శీను తదితరులు టిడిపి కండువా కప్పుకొని పార్టీ పట్ల నిబద్ధత వ్యక్తం చేశారు.

ఈ సందర్భంలో మండల అధ్యక్షుడు భీమ్రావు మాట్లాడుతూ, “శ్రీ నందమూరి తారకరామారావు పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పాలనలో పటేల్–పట్వారి వ్యవస్థ రద్దు, రెండు రూపాయల బియ్యం వంటి విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి” అన్నారు.

అలాగే నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గ్రామాలందరికీ రహదారులు, మహిళా డ్వాక్రా సంఘాలకు రుణాలు, కులవృత్తి ఆధారిత పథకాలు అమలు చేయడం జరిగిందని గుర్తుచేశారు. “కమ్మరి, మంగలి, బెస్త, కుమ్మరి ప్రతి వృత్తి వర్గానికి సహాయం చేసిన ఘనత టిడిపిదే” అని ఆయన వివరించారు.

మండలంలో రాబోయే జెడ్‌పీటీసీ, ఎం‌పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయం అని భీమ్రావు విశ్వాసం వ్యక్తం చేశారు. “ఎల్లారెడ్డిలో పసుపు జెండా ఎగరేస్తాం, టిడిపే అభివృద్ధి మార్గం” అని ఆయన పిలుపునిచ్చారు.

చివరగా, “అక్కలు, తమ్ముళ్లు, చెల్లెల్లు, అన్నలు అందరి ఆశీర్వాదం మాపై ఉండాలి” అని కోరుతూ “జై ఎన్టీఆర్ – జై చంద్రబాబు – జై తెలుగుదేశం” నినాదాలతో సమావేశం ముగిసింది.

Join WhatsApp

Join Now