మెదక్/నర్సాపూర్, జూలై 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా కేంద్రానికి బడ్జెట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి విచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అత్వాలే ను బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, ఉపాధ్యక్షుడు పాపగారి నాగేష్ గౌడ్ సన్మానించారు. శనివారం నర్సాపూర్ పట్టణంలో కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అత్వాలే కు బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, ఉపాధ్యక్షుడు పాపగారి నాగేష్ గౌడ్ తదితరులు స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అత్వాలే ను సన్మానించిన నాయకులు
Oplus_0