Site icon PRASHNA AYUDHAM

నిర్మల్ మున్సిపల్ కమిషనర్ ని కలిసిన బీసీ విద్యార్థి సంఘం నాయకులు

IMG 20241121 WA0083

మున్సిపల్ కమిషనర్ ఖమరుద్దీన్ గారిని మర్యాద పూర్వకంగా కలిసినా బీసీ విద్యార్తి సంఘము రాష్ట్ర కార్యదర్శి డా.ఈసవేని మనోజ్ యాదవ్*

నిర్మల్ మున్సిపల్ కమిషనర్ గా కొత్తగా వచ్చి బాధ్యతలు స్వీకరించిన ఖమరుద్దీన్  బీసీ విద్యార్ధి సంఘము రాష్ట్ర కార్యదర్శి డా.ఈసవేని మనోజ్ యాదవ్  శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాలలో పిచ్చి మొక్కలను శుభ్రం చేయించగలరని వినతిపత్రం అందజేయడం జరిగింది .ఈ సందర్భంగా డా.ఈసవేని మనోజ్ యాదవ్  మాట్లాడుతూ నిర్మల్ పట్టణం లోని సోఫీ నగర్ లో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పిచ్చి మొక్కలు విరివిగా పెరిగి అందులో నుండి పాములు తేళ్లు విద్యార్థులకు ఇబ్బందులను కలిగిస్తున్నాయని వాటి వల్ల విద్యార్థులకు ప్రాణభయం ఉందని వెంటనే వాటిని అధికారులకు చెప్పి శుభ్రం చేయించవలసిందిగా కోరామని మరియు నిర్మల్ టౌన్ లో మురికి కాలువలు చెత్తా చెదారాలు సరైన సమయంలో తీసుకు వెళ్లడం లేదని తెలిపారు. నిర్మల్లో కోతులు,కుక్కలు ఎక్కువ సంచరిస్తున్నయని వాటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు
దీనికి సరైన పరిష్కారం చేసి కోతులను కుక్కలను నిర్బంధించి ప్రజలను ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్యామకూర నితీష్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version