సంగారెడ్డి, ఆగస్టు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఈ నెల 25న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చేస్తున్న సత్యాగ్రదీక్షకు విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు ప్రభుగౌడ్ అన్నారు. ఆదివారం సంగారెడ్డి వైఎస్ ఆర్ భవన్ లో సత్యాగ్రహ దీక్ష వాల్ పోస్టర్లను బీసీ సంక్షేమ సంఘం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ.. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేస్తున్న సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా చలో హైదరాబాద్ 42శాతం బీసీ రిజర్వేషన్ తో ఎన్నికల వెళ్లాలనే నినాదంతో దీక్ష చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 25వ ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 3గంటల వరకు ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపార. ఈ దీక్షకు బీసీలందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున పాటిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర స్వామి, ముఖ్య సలహాదారులు చంద్రయ్య స్వామి, కార్యదర్శి సుధాకర్ గౌడ్, జగదీశ్వర్, శ్రీనివాస్, వినయ్, సంతోష్, మంజుల గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 25న సత్యాగ్రదీక్షకు విజయవంతం చేయాలి: బీసీ సంక్షేమ సంఘం నాయకులు
Oplus_131072