*డిసిసిబి డైరెక్టర్ ను కలిసిన బోర్లం నాయకులు*
ప్రశ్న ఆయుధం 10 అక్టోబర్(బాన్సువాడ ప్రతినిధి)
కొత్తగా నియమితులైన డిసిసిబి బ్యాంకు డైరెక్టర్ దామరంచ సొసైటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి గారిని మలిదశ ఉద్యమ ఫోరం మండల చీఫ్ అడ్వైజర్ పెద్దపెట్లోళ్ల దేవేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా డైరెక్టర్ కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ…రైతులందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని పేర్కొన్నారు.నాపై నమ్మకం ఉంచి డిసిసిబి డైరెక్టర్ గా నియమించిన ఉమ్మడి జిల్లాల ఇంచార్జి ఎక్సైజ్ &పర్యాటకశాఖ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏనుగు రవీందర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి తోపాటు పొలం జామ మజీద్,డాడీగే హైమద్,షేక్ మెహబూబ్,సయ్యద్ మంజూరు, యూత్ సభ్యులు రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.