గీత కార్మికుని పరామర్శించిన గౌడ సంఘ మండల నాయకులు

*తాడిచెట్టు పై నుండి కింద పడ్డ గీత కార్మికుని పరామర్శించిన గౌడ సంఘ మండల అధ్యక్షుడు తోడేటి జితేందర్*

*ఇల్లందకుంట డిసెంబర్ 19 ప్రశ్న ఆయుధం*

బుధవారం రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామానికి చెందిన బొమ్మ రవి గౌడ్ తండ్రి నారాయణ గీత వృత్తిలో భాగంగా తాడిచెట్టు ఎక్కి కళ్ళు గీసుకొని దిగె క్రమంలో మోకు జారి కిందపడగా తీవ్ర గాయాలు అయినవి తోటి గీతా కార్మికులు జమ్మికుంట ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినారు చికిత్స పొందుతున్న గీతా కార్మికుడిని సర్వాయి పాపన్న మొకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం నాయకులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మ్యాడగోని బుచ్చయ్య గౌడ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లెర్ల కొమురయ్య గౌడ్ గట్టు వీరన్న గౌడ్ సమ్మెట సాయి వికాస్ గౌడ్ శివ గౌడ్ ఇల్లందకుంట మండల అధ్యక్షుడు తోడేటి జితేందర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి రావుల విజయబాబు గౌడ్ మండల అధ్యక్షుడు జితేందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే సేఫ్టీ మొకులు అందించి గీతా కార్మికులను ఆదుకోగలరు మరియు గాయపడిన గీతా కార్మికులకు తక్షణమే ఎక్స్గ్రేషియా మంజూరు చేయించగలరు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందుగానే సేఫ్టీ మొకులు అందిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు అని పేర్కొన్నారు

Join WhatsApp

Join Now