* తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మ దహనం చేసిన రెడ్డి సంఘాలు నాయకులు
సిద్ధిపేట, ఫిబ్రవరి 4
సిద్దిపేట పట్టణం ముస్తాబాద్ చౌరస్తా వద్ద తీన్మార్ మల్లన్న దిష్టి బొమ్మను రెడ్డి సంఘం నాయకులు మంగళవారం దహనం చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలకు నిరసనగా సిద్దిపేట జిల్లాకు చెందిన రెడ్డి సంఘాల నాయకులు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న తీన్మార్ మల్లన్న ఒక కులంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, రెడ్డి కులం పై వ్యాఖ్యలు చేస్తే సహించబోమని తెలిపారు. అతని వ్యాఖ్యలపై గవర్నర్ కు, ముఖ్యమంత్రికి, శాసనమండలి చైర్మన్ కు, మంత్రులకు ఫిర్యాదులు చేస్తామని రెడ్డి సంఘాల నాయకులు తెలిపారు. న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షులు బత్తుల మమతారెడ్డి, జేఏసీ జిల్లా ఉపాధ్యక్షుడు వట్టిపెల్లి రాజిరెడ్డి, యశ్వంత్ రెడ్డి, రాజలింగారెడ్డి, ఆనంద్ రెడ్డి, నరేందర్ రెడ్డి, బాల్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, హనుమంత రెడ్డి, సత్యంరెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.