కర్షక్ బిఈడి కళాశాల ప్రిన్సిపల్ ను సన్మానించిన విద్యార్థి సంఘాల నాయకులు.

కర్షక్ బిఈడి కళాశాల ప్రిన్సిపల్ ను సన్మానించిన విద్యార్థి సంఘాల నాయకులు.

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూలై 22

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యార్థి సంఘాల నాయకులు తెలంగాణ యూనివర్సిటీ నుండి ఐదు మెడల్స్ సాధించిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యార్థి సంఘాల నాయకులు కర్షక్ బి.ఈడి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ కే రషీద్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన ద్వితీయ స్నాతకోత్సవంలో భాగంగా కర్షక్ బిఈడి కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి వరుసగా ఐదు బంగారు పథకాలు తీసుకురావడం హర్షించదగ్గ విషయం అన్నారు.

విద్యార్థులను ఉన్నత శిఖరాల వైపు ప్రోత్సహించి తీర్చిదిద్దిన ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ కే రషీద్ అధ్యాపక బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకి అభినందనలు తెలియజేశారు. విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ఈ విజయాల పరంపర ఇలాగే కొనసాగించాలని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి సంఘాల నాయకులు ఐరేని సందీప్, ఆజాద్, బాలు, ముదాం అరుణ్, జీవీఎం విటల్, సురేష్, నాగరాజు, లక్ష్మణ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now