హరీష్ రావును పరామర్శించిన ఉపాధ్యాయ సంఘం నాయకులు

సంగారెడ్డి/పటాన్ చెరు, నవంబరు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): హైదరాబాద్ లోని కోకాపేటలో గల క్రిన్స్ విల్లాలో నివాసం ఉంటున్న మాజీ మంత్రి, సిద్ధిపేట శాసన సభ్యుడు తన్నీరు హరీశ్ రావును ఆదివారం ఆయన నివాసంలో సంగారెడ్డి శాసన సభ్యుడు చింతా ప్రభాకర్ తో కలిసి తెలంగాణ రాష్ట్ర గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండం మోహన్ రెడ్డి, తెలంగాణ ప్రోగ్రెసీవ్ టీచర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గోవిందారం వేణు గోపాలస్వామిలు మర్యాద పూర్వకంగ కలిశారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవల పరమపదించినందున వారిని పరామార్శించి, వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుబూతిని తెలియజేశారు. అంతకు ముందు దివంగత తన్నీరు సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలను సమర్పించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మధుకర్ రెడ్ఢి, నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment