కత్తి కార్తీక గౌడ్ ను సన్మానించిన గౌడ సంఘం నాయకులు

మెదక్/నార్సింగి, జనవరి 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం దుబ్బాకలోని కత్తి కార్తీక గౌడ్ కార్యాలయంలో ఆమెను గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జాతీయ, రాష్ట్ర కమిటీ నాయకులు శాలువాతో సన్మానించి పూలబొకె అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జాతీయ సెక్రటరీ జనరల్ రాగుల సిద్ది రాములు గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండాపురం బాల్ రాజు గౌడ్, కోశాధికారి ఎవి బలేషంగౌడ్, బలసని సురేష్ గౌడ్, ముత్యం నర్సింలు గౌడ్, బుచ్చన్నగారి కిషన్ గౌడ్, మెదక్ జిల్లా అధ్యక్షుడు ఆకుల మల్లేశంగౌడ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పాత్రల స్వామి గౌడ్, కంచర్ల సిద్ది రామలుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now