జిల్లా ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్ తో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు*
పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిది 22-04-2025 (ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు
ఆస్పత్రిలో వైద్య సేవలు మెరుగుపడాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా చైర్మన్ వంగల దాలి నాయుడు, నియోజకవర్గం చైర్మన్ సిరిసుపిల్లి సాయి శ్రీనివాస్, మండల అధ్యక్షులు తీళ్ల గౌరీ శంకరరావు తదితరులు పార్వతీపురం మన్యం జిల్లా ఆస్పత్రి నూతన సూపరింటెండెంట్ గా బాధ్యతలు చేపట్టిన జి.నాగ శివ జ్యోతి ని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగత శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలి అన్నారు. వైద్యుల హాజరు పై ఉన్న ఆరోపణలు ఇకపై లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో గిరిజన నిరుపేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు అధిక శాతం ఉండటం, వారంతా జిల్లా ఆసుపత్రి వైద్య సేవలపై ఆధారపడడం జరుగుతోందన్నారు. కాబట్టి జిల్లా ఆస్పత్రిలో ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. ముఖ్యంగా ఆసుపత్రి ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాతా శిశు మరణాలు లేకుండా చూడాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రి నుండి విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు రిఫరల్ కేసులు తగ్గేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్నపిల్లలకు, రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఆసుపత్రిలో పనిచేసినప్పుడు అందించిన సేవలు జిల్లా ప్రజలకు మళ్లీ అందుతాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి డా. నాగభూషణ రావును కూడా జిల్లా ఆస్పత్రిలో అవకాశం కల్పిస్తే గతంలో ప్రజలకు అందిన మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రికి అవసరమైనవన్నీ ప్రభుత్వం సమకూర్చాలన్నారు. రోగుల రద్దీకి తగ్గట్టు వైద్యులు, టెక్నీషియన్లు, సిబ్బంది తదితర వసతులు కల్పించాలన్నారు., అవసరమైన అదనపు గదులు, మరమ్మత్తుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమం తమ పార్టీ ఇంచార్జ్ బత్తిన మోహన రావు ఆదేశాల మేరకు నిర్వహించటం జరిగిందనారు.