జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పర్యాటకులు పై జరిగిన ఉగ్రదాడికి నిరసన తెలిపిన : జనసేన పార్టీ నాయకులు
ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 23: కూకట్‌పల్లి ప్రతినిధి
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్ మరియు జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి సాగర్. కూకట్పల్లి జనసేన పార్టీ ఇన్చార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ లు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో 28 మంది ఉగ్రవాదుల దాడిలో మరణించడం బాధాకరమని వారందరికీ జనసేన పార్టీ తరఫున నివాళులు తెలియజేస్తున్నామన్నారు. ఉగ్రవాదుల దాడులకు నిరసన తెలుపుతూ వరుసగా మూడు రోజులపాటు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి మీడియా కోఆర్డినేటర్ కొల్లా శంకర్. భోగాది వెంకటేశ్వరరావు, ఎన్ . నాగేంద్ర ,వేముల మహేష్ , పసుపులేటి ప్రసాద్ పోలిపోయిన శ్రీనివాస్ , పాదం సూర్య, మోహన్ , నవీన్ , క్రాంతి, శంకర్రావు, పులగం సుబ్బు , వీర మహిళలు మహిళలు అనిత గాలి యార్ల శిరీష , పాల్గొన్నారు.