మెదక్/నర్సాపూర్, ఫిబ్రవరి 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): గుమ్మడిదల మండలం ప్యారానగర్ లో డంపు యార్డు ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేస్తూ జేఏసీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గురువారం నాటికి నాల్గవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా గుమ్మడిదల జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. ప్యారానగర్ లో డంపుయార్డు ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మురళీధర్ యాదవ్, చిమ్ముల గోవర్దన్ రెడ్డిలు మాట్లాడుతూ.. ప్యారానగర్ లో డంపుయార్డు ఏర్పాటు ఏర్పాటుతో అడవి, చెరువు పూర్తిగా నాశనం అవుతాయని తెలిపారు. ఇక్కడి నుంచి డంపుయార్డు తరలించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మురళీధర్ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్దన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, చిమ్ముల దేవేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయీముద్దీన్, మాజీ కౌన్సిలర్లు గోడ రాజేందర్, ఆంజనేయులుగౌడ్, దావుద్, ఆయా పార్టీల నాయకులు పంబాల బిక్షపతి, సత్యంగౌడ్, రమణారావు, శ్రీనివాస్ గుప్తా, రమణారావు, డి. ఆంజనేయులుగౌడ్, రాధా కిషన్ గౌడ్, రిజ్వాన్, మహ్మద్ షరీఫ్, షేక్ హుస్సేన్, మిర్యాల చంద్రశేఖర్, మన్సూర్, సద్దాం, అమెద్, మొహిస్, శంషు, బాబా, షహీద్, మస్సి, ఫైసల్, హఫీజ్, మోసిన్, హవెస్, అజ్జు, సాదుల్లా తదితరులు పాల్గొన్నారు.