బదిలీపై వెళ్తున్న ఏఎస్ఐ రవీందర్ రెడ్డిని శాలువాతో సత్కరించిన యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శివ యూత్ నాయకులు
ఇల్లందకుంట డిసెంబర్ 25 ప్రశ్న ఆయుధం
బుధవారం రోజున బదిలీపై వెళ్తున్న ఏఎస్ఐ రవీందర్ రెడ్డిని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ది శివకుమార్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పెద్ది శివకుమార్ మాట్లాడుతూ ఏఎస్ఐ రవీందర్ రెడ్డి ఇల్లందకుంట మండలంలోని అన్ని గ్రామాల్లోని పెద్దలతో యువకులతో సన్నిహిత భావంతో మెలిగేవాడని స్టేషన్కు వచ్చిన ప్రతి వ్యక్తిని మర్యాదగా గౌరవించి సముచిత స్థానం కల్పించేవాడని అరాచకం చేసిన వారి పట్ల కటువుగా ప్రవర్తించేవాడని విధి నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా మిలిగేవాడని ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ అనేది తప్పనిసరి అని ఎక్కడికి వెళ్లినా రవీందర్ రెడ్డి తన వీధి నిర్వహణ పట్ల అంకితభావంతో ఉంటారని యువతకు తగు సూచనలు చేస్తూ ఉంటారని అన్నారు తన వెంట యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు