మహిళా పొదుపు సంఘాల నాయకురాళ్లులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్
ప్రశ్న ఆయుధం జూలై 23 : కూకట్పల్లి ప్రతినిధి
జిహెచ్ఎంసిలో ఆర్పీలు (రిసోర్స్ పర్సన్స్) కు ఇస్తున్న మాదిరే తమకు సమాన వేతనం ఇవ్వాలని కూకట్పల్లి మహిళా పొదుపు సంఘాల నాయకురాళ్లు డిమాండ్ చేశారు ఈ మేరకు మంగళవారం కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, బండి రమేష్ ని బాలానగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కలిసి నిలిచిపత్రం సమర్పించారు తాము ఇరవై సంవత్సరాలుగా పొదుపు సంఘాలను నడిపిస్తున్నామని కానీ మాకు ఎలాంటి వేతనం లభించడం లేదని వారు పేర్కొన్నారు మహిళా గ్రూపులు నడిపించడంలో తలెత్తుతున్న సమస్యలను రమేష్ కి వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన మహిళా సంఘాల సమస్యలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు వీలైనంత త్వరగా కృషి చేస్తానన్నారు నాయకులు లక్ష్మయ్య రాజశేఖర్ యాదగిరి పుష్ప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.