*మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించిన శ్రేణులు*
*సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే నేతల వేడుకోలు*
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ లో గులాబి అధినేత కేసీఆర్ ను పరామర్శించారు. శనివారం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయురారోగ్యాలతో పాటు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నేతలు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగనికై సిద్ధమైన కెసిఆర్ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని వేడుకున్నట్లు నేతలు పేర్కొన్నారు..